ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పట్టణంలోని జావిద్‌బాయ్ మినీ స్టేడియంలో శుక్రవారం జిల్లా సబ్ జూనియర్ బేస్‌బాల్ బాల, బాలికల జట్లను ఎంపిక చేసినట్లు జిల్లా బేస్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మధుసూదన్ రెడ్డి, సొప్పరి వినోద్ తెలిపారు. బాలికల విభాగంలో 51 మంది పాల్గొనగా అందులో 25 మంది బాలికలను ఎంపిక చేశామని, బాలుర విభాగంలో 22 మంది హాజరు కాగ 18 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. వారు శిక్షణ అనంతరం ఈనెల 28 నుంచి 30 వరకు డిచ్‌పల్లి 7వ బెటాలియన్‌లో జరిగే ఆరవ రాష్ట్ర సబ్ జూనియర్ బేస్‌బాల్ పోటీలలో పాల్గొంటారన్నారు. ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్, జిల్లా వ్యాయమ ఉపాధ్యాయులు రమేష్, అనిల్, వీణ, కోచ్‌లు అనికేత్, మౌనిక, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.


