నల్లమట్టి వాహనాల పట్టివేత | - | Sakshi
Sakshi News home page

నల్లమట్టి వాహనాల పట్టివేత

Apr 25 2026 7:18 AM | Updated on Apr 25 2026 7:18 AM

నల్లమట్టి వాహనాల పట్టివేత ఇసుక ట్రాక్టర్‌ ..

నందిపేట్‌ (ఆర్మూర్‌): గోదావరి పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా నల్లమట్టిని తరలిస్తున్న వా హనాలను శుక్రవారం రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు.నిర్మల్‌ జిల్లా లోకేశ్వర్‌ మండలం గోదా వరి నది నుంచి అక్రమంగా నల్లమట్టిని అధిక లో డుతో టిప్పర్లలో నింపుతూ నందిపేట మండలం మీదుగా వెళుతుండగా,9 వాహనాలను పట్టుకున్న ట్లు తహసీల్దార్‌ సంతోష్‌ రెడ్డి తెలిపారు. నిబంధన ల ప్రకారం జరిమానా విధించనున్నట్లు ఆయన తె లిపారు.రైతుల పేరిట కొందరు నల్ల మట్టి వ్యాపా రం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇందల్వాయి: మల్లాపూర్‌లో ని వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ ను పట్టుకున్నట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ప్రభు త్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని సమాచారం రావడంతో వెంటనే పోలీసులు మల్లాపూర్‌ వాగు వద్దకు వెళ్లి ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. డ్రైవర్‌ను పట్టుకొని విచారించగా ఎటువంటి అనుమతులు చూపించలేదన్నారు. వెంటనే ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకవచ్చి, డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement