రుద్రూర్: పోతంగల్ మండల కేంద్రంలో గుర్తు తెలి యని వ్యక్తులు కారును దహనం చేశారు. గ్రామానికి చెందిన మహమ్మద్ జుమ్మాఖాన్ తన పాత మారుతీ కారును ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలో నిలిపిఉంచేవాడు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు కారుకు నిప్పంటించారు. దీంతో కారు పూర్తిగా కాలిపోయింది. కారు పక్కనే నిలిపి ఉంచిన జంగం విట్టల్‌కు చెందిన టీవీఎస్ ఎక్స్‌ఎల్ బండి కూడా కొంత మేరకు దెబ్బతింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సునీల్ తెలిపారు.


