మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీలో కుక్కల దాడిలో శుక్రవారం లేగ దూడ మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. టీచర్స్ కాలనీ లోని హనుమాన్ ఆలయానికి చెందిన లేగదూడపై వారం రోజుల క్రితం కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. దీంతో లేగదూడ వింతగా ప్రవర్తిస్తు మృతి చెందిందని వారు తెలిపారు. అలాగే ఇటీవల గ్రామంలోని రైతుల ఇళ్ల ముందు కట్టిన ప శువులపై సైతం కుక్కలు దాడి చేశాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి కుక్కల నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


