సుభాష్‌నగర్: బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నూతుల శ్రీనివాస్‌రెడ్డి (ఆర్మూర్) నియమితులయ్యారు. ఈమేరకు కిసాన్ మోర్చా పూర్తిస్థాయి కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షుడు బస్వాపురం లక్ష్మీనర్సయ్య గురువారం ప్రకటించారు. జిల్లా నుంచి శ్రీనివాస్‌రెడ్డికి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అవకాశం లభించింది. ఆయన గతంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా ప్రధానకార్యదర్శిగా, బీజేపీ ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్‌గా పనిచేశారు. తనకు ఈ అవకాశం కల్పించినందుకు జిల్లా, రాష్ట్ర నాయకత్వానికి శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. జిల్లాతోపాటు రాష్ట్రంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమిస్తూనే, బీజేపీ బలోపేతం కోసం మరింత పని చేస్తానని ఆయన తెలిపారు.
నిజామాబాద్ రూరల్: పిల్లలలో సాంస్కృతిక విలువలు, నైతికత ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు ఇస్కాన్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ‘సంస్కార్ సమ్మర్ క్యాంప్–2026’ ఈనెల 24న ప్రారంభమైంది. ప్రతి రోజు ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు క్యాంప్ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. 8ఏళ్ల నుంచి 15ఏళ్ల లోపు వయస్సు గల పిల్లలు ఈ శిబిరంలో పాల్గొనవచ్చాన్నారు. ఈ సమ్మర్ క్యాంప్ మే 4 వరకు కొనసాగుతుందన్నారు. శిబిరంలో ధ్యానం, యోగా, శ్లోక పఠనం, కీర్తన, నృత్యం, సాంప్రదాయ కళలు, విలువల ఆధారిత విద్యతోపాటు వినోదాత్మక ఆటలు, అల్పాహారం ప్రసాదం అందిస్తున్నట్లు అధ్యక్షులు శ్రీమాన్ సిద్ధ బలరాం దాస్ తెలిపారు.
నందిపేట్ (ఆర్మూర్): నందిపేట్ మండలానికి చెందిన సర్పంచులు శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రులను కలిసి తమ సమస్యల ను విన్నవించుకున్నారు. ఆర్మూర్ నియోజకవ ర్గ ఇన్‌చార్జి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిశారు.నందిపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రా న్ని 30 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసి 24 గంటలు వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబుని క లిసి లక్కంపల్లి శివారులో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను నెలకొల్పాలని విన్నవించారు.మంత్రులు సా నుకూలంగా స్పందించినట్లు సర్పంచులు పే ర్కొన్నారు. మండల సర్పంచ్‌ల ఫో రం అధ్యక్షుడు ఎర్రం లింగం,వివిధ గ్రామాల సర్పంచు లు లక్ష్మీనారాయణ,శ్రీకాంత్,సాయి కుమార్, దేవేందర్,దేవదాసు,ముత్యం,నవీన్, మహమూద్,హనుమాన్,సుదన్,జీవన్ పాల్గొన్నారు.
మోపాల్: మండలంలోని కులాస్‌పూర్ తండాలో గురువారం రాత్రి జరిగిన వివాహ కార్యక్రమంలో అధిక శబ్ధంతో డీజే పెట్టినందుకు ఆపరేటర్ కెతావత్ అశోక్‌పై కేసు నమోదు చేసిన్నట్లు ఎస్‌ఐ జాడె సుస్మిత శుక్రవారం తెలిపారు. డీజేను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించామన్నారు. డీజే శబ్ధంతో ప్రజలకు ఇబ్బంది కలగడంతో స్థానికులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా డీజే నడుపుతున్నట్లు గుర్తించిన పోలీసులు డీజే ఆపరేటర్‌పై కేసు నమోదు చేశామన్నారు. అనుమతులు లేకుండా ఎవరైనా డీజేలు, లౌడ్ స్పీకర్లు వినియోగించకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని ఎస్‌ఐ హెచ్చరించారు.


