రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి

Apr 25 2026 7:18 AM | Updated on Apr 25 2026 7:18 AM

నిజామాబాద్‌ రూరల్‌: రానున్న ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే ధ్యేయంగా రైతు కమిషన్‌ సభ్యులు పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయంలో శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధ్యక్షతన, కమిషన్‌ చైర్మన్‌ కోదండ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి పలు అంశాలపై చర్చించారు.

ఇరిగేషన్‌ మంత్రితో సమావేశం..

ఇరిగేషన్‌ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, రాష్ట్ర రైతు కమిషన్‌ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సమావేశంలో చెరువుల పరిరక్షణకు స్థిరమైన వ్యవస్థ, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రాముఖ్యత వంటి అంశాలపై వారు చర్చించారు. చెరువుల మట్టి తొలగింపు అంశాలపై రూపొందించిన సమగ్ర నోట్‌ను మంత్రికి రాష్ట్ర రైతు కమిషన్‌ సభ్యులు సమర్పించారు. సభ్యులు రాములు నాయక్‌ (మాజీ ఎమ్మెల్సీ), భవాని మరికంటి, సునీల్‌ , గడుగు గంగాధర్‌,శ్రీ రాంరెడ్డి గోపాల్‌ రెడ్డి, సురేంద్ర మోహన్‌, మెంబర్‌ సెక్రెటరీ గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement