నిజామాబాద్ లీగల్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా న్యాయవాదుల సొసైటీకి జరిగిన ఎన్నికల్లో చింతకుంట సాయిరెడ్డి అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శి గా పడిగెల వెంకటేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో నాలుగు డైరెక్టర్ స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు పోటి చేయగా, చింతకుంట సాయిరెడ్డి, రెంజర్ల సురేష్, వి. దిలీప్, నర్సారెడ్డి ఎన్నికల్లో విజయం సాధించారు. కొత్తగా ఎన్నికై న నలుగురు డైరెక్టర్లు, అప్పటికే ఉన్న ఎనిమిది మంది డైరెక్టర్లు కలిపి సొసైటీకి కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సాయిరె డ్డి, ప్రధాన కార్యదర్శిగా వెంకటేష్, ఉపాధ్యక్షుడిగా ఆ ర్మూర్‌కు చెందిన విప్లవ్ కిరణ్, జాయింట్ సెక్రెటరీ గా బోధన్‌కు చెందిన రవీంధర్, ట్రెజరర్‌గా శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికయ్యారు. వీరు ఏడాదిపాటు పదవీ లో కొనసాగనున్నారు. ఎన్నికల అధికారులు జగన్మోహన్ గౌడ్, జైపాల్, సొసైటి మాజీ ప్రధాన కా ర్యదర్శి వెంకట్రమణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


