సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

Apr 24 2026 5:56 AM | Updated on Apr 24 2026 5:56 AM

ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు

పోలీస్‌ కమిషనర్‌ సాయిచైతన్య

సుభాష్‌నగర్‌: విద్యార్థులు సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, సోషల్‌ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య సూచించారు. నగరంలోని ప్రభుత్వ మెడిక ల్‌ కళాశాలలో నిజామాబాద్‌ యాంటీ ర్యాగింగ్‌, మ త్తు పదార్థాల నివారణ, సైబర్‌ క్రైమ్‌పై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన సీపీ సాయిచైతన్య.. విద్యార్థులకు చట్టపరమైన అవగాహనతోపాటు సమాజంలో బా ధ్యతాయుత పౌరులుగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు. ర్యాగింగ్‌ తీవ్రమైన నేరమని, ఎవరై నా ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. మత్తు పదార్థాల వినియోగం వి ద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తును దెబ్బతీస్తుందని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కృష్ణమో హన్‌, జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగమోహన్‌ మాట్లాడుతూ కళాశాలలో ర్యాగింగ్‌కు జీరో టాలరెన్స్‌ విధానం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థుల భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా, మత్తు పదార్థాలకు దూ రంగా ఉండటం, సైబర్‌ భద్రత పాటించాలని ప్రతిజ్ఞచేశారు. ఈగిల్‌ సెల్‌, ఆర్‌ఎన్‌సీసీ డీఎస్పీ సో మనాథం, సీసీపీఎస్‌ ఏసీపీ వెంకటేశ్వర్‌రావు,ఏసీపీ ప్రకాశ్‌, న్యాయవాది నారాయణ, వైద్యులు జలగం తిరుపతిరావు, కిశోర్‌, వన్‌ టౌన్‌ సీఐ రఘుపతి, కళాశాల సూపరింటెండెంట్‌ నాగరాజు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement