● మానాల మోహన్‌రెడ్డి
వేల్పూర్: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలో గురువారం ఆయన రేఖ భూమేశ్వర్, వి జయలక్ష్మి నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సొంతింటి కల తీర్చాలనే ల క్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ గృహాలు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని 119 నియో జకవర్గాల్లో 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని చెప్పారు. గతంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు వస్తాయని పేదలు ఎంతో ఆశపెట్టుకోగా, వారి ఆశలు ఆవిరయ్యాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో లక్కోర, పడగల్, కుకునూర్ గ్రామాల సర్పంచులు దాసరి అపర్ణరాజు, నల్లరాజు, భూమారెడ్డి, ఉపసర్పంచ్ ఆత్మారాం, మండల కాంగ్రెస్ అధ్యక్షు డు గడ్డం నర్సారెడ్డి, రిటైర్డ్ ఎంవీఐ సుభాష్, గౌరా యి నరేందర్, ఆర్మూర్ మోహన్, చిన్న హన్మాండ్లు, ముత్యం, రమణ, రమేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.


