సృజనాత్మకతను వెలికితీసేందుకే వేసవి శిక్షణ | - | Sakshi
Sakshi News home page

సృజనాత్మకతను వెలికితీసేందుకే వేసవి శిక్షణ

Apr 24 2026 5:56 AM | Updated on Apr 24 2026 5:56 AM

అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌

నిజామాబాద్‌ రూరల్‌: పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలిగితీయడానికే బాలభవన్‌ వివిధ కళలలో తీర్చిదిద్దుతుందని అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌ పేర్కొన్నారు. జిల్లా బాలభవన్‌లో వేసవి శిక్షణ తరగతులను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లా డుతూ బాలభవన్‌లో 30 రకాల అంశాలు నేర్పటం ఎంతో గొప్పగా ఉందని, ఈతరం పిల్లలకు నీతికథలు, శ్లోకాలు, మ్యాజిక్‌, కర్రసాము ఎంతో ఉపయోగపడతాయన్నారు. బాలభవన్‌ సూపరింటెండెంట్‌ ఉమాబాల మాట్లాడుతూ జూన్‌ 10 వరకు శిక్షణ తరగతులు కొనసాగుతాయన్నారు. అంతకుముందు జాదూ యుగంధర్‌ రంగనాథ్‌ ప్రదర్శించిన మ్యాజిక్‌ అలరించింది. కార్యక్రమంలో అదనపు ఇన్‌చార్జి విఠల్‌ ప్రభాకర్‌, వెంకటలక్ష్మి, పుష్పలత, శ్వేత, నటరాజ్‌, రాంచందర్‌, గణేశ్‌, పవన్‌, విజయ, రిచ, మాధవి, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement