సుభాష్‌నగర్: కాంగ్రెస్ జాతీయ ఆదివాసీ, గిరిజన రాష్ట్ర, జిల్లా చైర్మన్లతో లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఇందిరా భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ స్వయంగా జిల్లా అ ధ్యక్షులతో మాట్లాడారు. ఆదివాసీ, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలతో కలుగుతున్న ఇబ్బందులపై చర్చించారు. సమావేశంలో కాంగ్రెస్ ఆది వాసీ, గిరిజన జిల్లా చైర్మన్ కెతావత్ యాదగిరి, నాయకులు కెతావత్ సురేష్ నాయక్ పాల్గొన్నారు.


