డిచ్‌పల్లి: వాహనం అదుపుతప్పి ఓ యువకుడు మృతి చెందిన ఘటన డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్సై ఆరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి మండలం గంగారాం తండాకు చెందిన గంగావత్ రాహుల్(19), మాలవత్ స్నేహిత్‌తో కలిసి డిచ్‌పల్లి మండలానికి వచ్చి పెరుగు బకెట్లను తీసుకొని స్కూటీపై ఇందల్వాయి వైపు బయల్దేరారు. మార్గమధ్యంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద స్కూటీ అదుపుతప్పి పక్కనే ఉన్న సిమెంట్ పైపులను ఢీకొట్టింది. తీవ్రగాయాలైన ఇద్దరిని జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాహుల్ మృతి చెందాడు. తండ్రి గంగావత్ పరశురాం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


