నిజామాబాద్‌అర్బన్: కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు హర్షణీయమని మాజీ ఎమ్మెల్యే బిగా ల గణేశ్ గుప్తా పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. కోర్టు తీర్పుతో న్యాయం గెలిచిందన్నారు. పీసీ ఘోష్ కమిషన్ విచారణలో ప్రాథమిక నిబంధనలు పాటించలేదని కోర్టు స్ప ష్టం చేయడంతో ఆ నివేదికకు చట్టపరమైన ప్రాము ఖ్యత లేదన్నారు. సెక్షన్ 8 కింద సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించడం అత్యంత కీలక మని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుపై రాజకీయంగా ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కమిషన్‌లను అడ్డం పెట్టుకొని వేధింపులకు పాల్పడిందన్నారు. న్యాయస్థానాలపై నమ్మకంతో పోరాడగా చివరకు నిజం గెలిచిందన్నారు. కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్, బీజేపీలు కక్షపూరితంగా వ్యవహరిస్తు న్నాయని పేర్కొన్నారు. ప్రాజెక్టు మరమ్మతులను సకాలంలో చేపట్టకుండా దాదాపు రెండున్నరేళ్లు ఆ లస్యం చేశారని, చివరకు గత్యంతరం లేక పనులు చేపడుతున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బీఆర్‌ఎస్ పార్టీపై త ప్పుడు ఆరోపణలు చేస్తుందన్నారు. సమావేశంలో మాజీ మేయర్ నీతు కిరణ్, పార్టీ నగర అధ్యక్షుడు శిల్ప రాజు, నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్, నవీన్ ఇక్బాల్ పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా


