సెలవులు వృథా చేసుకోవద్దు | - | Sakshi
Sakshi News home page

సెలవులు వృథా చేసుకోవద్దు

Apr 24 2026 5:56 AM | Updated on Apr 24 2026 5:56 AM

ఫోన్‌కు అలవాటుపడి భవిష్యత్తును పాడు చేసుకోవద్దు

విద్యార్థులకు కలెక్టర్‌

ఇలా త్రిపాఠి ఉద్బోధ

డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌): వేసవి సెలవులను చక్కగా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠి విద్యార్థులకు సూచించారు. సెలవులను వృథా చేసుకోవద్దని, స్మార్ట్‌ ఫోన్లకు అలవాటుపడి భవిష్యత్తును పాడు చేసుకోవద్దని మార్గనిర్దేశం చేశారు. తల్లిదండ్రులు సైతం పిల్లలను జాగ్రత్తగా గమని స్తూ ఉండాలని,వారంలో అరగంటకు మించి పిల్ల లు స్మార్ట్‌ ఫోన్‌ వినియోగించకుండా చూడాలన్నా రు డిచ్‌పల్లి మండలం సుద్దపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులపాఠశాల/కళాశాలలో గురువారం నిర్వహించిన పేరెంట్స్‌ – టీచర్స్‌ మీటింగ్‌కు కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థినులు వారి తల్లిదండ్రులతో భేటీ అయ్యారు. వేసవి సెలవులలో ఏం చేస్తారని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. సెలవులను ఉల్లాసంగా గడుపుతూ, ఇష్టమైన రంగంలో ప్రతిభను మరింతగా మెరుగుపర్చుకునేలా కృషి చేయాలని హితవు పలికారు. స్విమ్మింగ్‌, కరాటే, డ్యాన్స్‌, సంగీతం వంటి వాటిలో తమ అభిరుచికి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. వీలైతే చారిత్రక ప్రదేశాలను సందర్శించాలన్నారు. రెసిడెన్షియల్‌ స్కూల్‌లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.అనంతరం ఉత్తమ విద్యార్థినులకు కలెక్టర్‌ బహుమతులు ప్రదానం చేశారు. సమావేశంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ నళిని, తహసీల్దార్‌ సతీశ్‌ రెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement