రెండో రోజూ కొనసాగిన సమ్మె | - | Sakshi
Sakshi News home page

రెండో రోజూ కొనసాగిన సమ్మె

Apr 24 2026 5:50 AM | Updated on Apr 24 2026 5:50 AM

నిజామాబాద్‌ రూరల్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజైన గురువారం సైతం కొనసాగింది. గామీణ ప్రాంతలకు బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొత్తం 650 అద్దె బస్సులు ఉండగా, 325 సర్వీసులు కామారెడ్డి, బోధన్‌, వరంగల్‌, ఆర్మూర్‌, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు గురువారం నడిచినట్లు డిప్యూటీ రీజినల్‌ మేనేజర్‌ మధుసూదన్‌ తెలిపారు. రానున్న రోజుల్లో సమ్మె ఇలాగే కొనసాగితే 650 సర్వీసులను నడుపుతామని ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. అ ర్హులను డైవర్‌, కండక్టర్‌లుగా రిక్రూట్‌ చేసుకుంటామన్నారు. కార్మికుల సమ్మె నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని డిపో–1 డిపో–2, బస్టాండ్‌లో పోలీస్‌ పికె ట్‌ ఏర్పాటు చేశారు. కార్మికులు పాత కలెక్టరేట్‌ మైదానంలో సమ్మె చేశారు.

కష్టం ఎక్కువ.. జీతం తక్కువ

ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు రోజు కు 14 నుంచి 16 గంట లు విధు లు నిర్వర్తిస్తున్నప్పటికీ ప్రభు త్వ ఉద్యోగుల క న్నా 28శాతం జీతం తక్కువ గా ఉంది. మాకు కష్టం ఎక్కు వ, జీతం తక్కువ. 2021, 2025 వేతన సవరణలు వెంటనే చేపట్టాలి. – సామల శ్రీకాంత్‌,

ఆర్టీసీ జేఏసీ నిజామాబాద్‌–1 డిపో కో కన్వీనర్‌

ఎనిమిది గంటల డ్యూటీ వేయాలి

రోజుకు 12 నుంచి 16 గంటలు పనిచేస్తే గతంలో స్పెష ల్‌ ఆఫ్‌ డ్యూటీలుగా ఇచ్చేవా రు. ఇప్పుడు సిబ్బంది తగ్గ డంతో సింగిల్‌ క్రూలుగా మా ర్చి ఒకరోజు మస్టర్‌ మాత్ర మే ఇస్తున్నారు. ఎనిమిది గంటల డ్యూటీ వేయాలి.

– అరుంధతి, కండక్టర్‌, నిజామాబాద్‌ డిపో – 1

ఇబ్బందులు ఎదుర్కొన్న

బస్సు ప్రయాణికులు

325 సర్వీసులను నడిపిన ఆర్టీసీ

అద్దె బస్సులను పెంచేందుకు

చర్యలు చేపడుతున్న సంస్థ

Advertisement
 
Advertisement
Advertisement