మండుటెండలో హైటెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

మండుటెండలో హైటెన్షన్‌

Apr 24 2026 5:50 AM | Updated on Apr 24 2026 5:50 AM

ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం 43 డిగ్రీలకుపైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటికి వెళ్లాలంటేనే జనాలు భయపడుతుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రతను లెక్క చేయకుండా కార్మికులు ఇలా హైటెన్షన్‌ టవర్లపై వైర్లు బిగిస్తున్నారు. ప్రమాదాన్ని లెక్క చేయకుండా సన్నటి వైర్లపై వేలాడుతూ నిజామాబాద్‌ నగర శివారులోని బోర్గాం(పి) ప్రాంతంలో పని చేస్తున్న కార్మికులను అటువైపు వెళ్తున్న వాహనదారులు, ప్రజలు ఆసక్తిగా తిలకించారు. వారి పనితీరును అభినందిస్తున్నారు. – డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్‌)

Advertisement
 
Advertisement
Advertisement