సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ఆర్టీసీ కార్మికులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, కార్మికుల పోరాటానికి బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి గు రువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్ర భుత్వ దుర్మార్గ విధానాల ఫలితంగా అన్నివర్గాల ప్రజలు రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సంపేటలో శంకర్ గౌడ్ అనే ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేయడం దురదృష్టకరమని, ఆయనకు తక్షణమే మెరుగైన వైద్యం అందించి, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా మని కేసీఆర్ హయాంలో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వంద రోజు ల్లో విలీన ప్రక్రియ పూర్తి చే స్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. విధిలేని పరిస్థి తుల్లోనే కార్మికులు సమ్మెకు వెళ్లారని పేర్కొన్నా రు. సమ్మె వెనుక హరీశ్ రావు ఉన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, హరీశ్‌రావు ఎప్పుడూ సమస్యల్లో ఉన్న వారికే మద్దతు ఇస్తారని పేర్కొన్నారు. ఉచిత బస్సు పథకానికి రూ.9 వేల కోట్లు కేటాయించా మని చెబుతున్న ప్రభుత్వం.. కార్మికుల సమస్య లను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు.


