తగ్గేదేలే.. | - | Sakshi
Sakshi News home page

తగ్గేదేలే..

Apr 23 2026 8:30 AM | Updated on Apr 23 2026 8:30 AM

నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు

వందకు

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌) : ఉపాధిహామీ (వీబీ జీ రామ్‌ జీ)లో వేసవి పనులు మొదలైన నేపథ్యంలో కూలీల హాజరుపై గ్రామీణాభివృద్ధి శాఖ దృష్టిసారించింది. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కూలీల హాజరు గణనీయంగా పెంచాలని, వంద మందికి తగ్గకుండా పనికి వచ్చేలా చూడాలని డీఆర్డీవో సాయన్న ఆ దేశాలు జారీచేశారు. పనులు కల్పించని వారిని ఉ పేక్షించేది లేదని, షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తామ ని స్పష్టం చేశారు. డీఆర్డీవోతోపాటు ఎంపీడీవోలు, ఏపీవోలు, టీఏలు, ఈసీలు పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి కూలీలు ఎంతమంది హాజరవుతున్నారో రోజువారీగా పర్యవేక్షణ చేస్తున్నారు. దీంతో గడిచిన వారం రోజుల్లో కొంతమేర కూలీల హాజరుశాతం పెరిగింది. ప్రస్తుతం దాదాపు 28 వేల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. దీనిని రోజుకు 50 వేలకు పెంచాలని గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు కూలీల హాజరును బాగా పెంచి మంచి పనితీరు కనబరిచిన ఫీల్డ్‌ అసిస్టెంట్లకు రూ.1,000 చొప్పున నగదు ప్రోత్సాహం ఇవ్వాలని నిర్ణయించారు. కాగా, నిర్లక్ష్యంగా ఉన్న వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

మే 31 వరకు 18 లక్షల పనిదినాలు లక్ష్యం...

కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ‘వీబీ జీ రామ్‌ జీ’గా పేరు మార్చడంతో జిల్లాకు రెండు నెల ల మట్టుకే పనిదినాల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఏప్రి ల్‌, మే నెలలకు కలిపి మొత్తం 18 లక్షల పనిదినా లు కల్పించాల్సి ఉంది. ఇప్పటి వరకు 2.84 లక్షల పనిదినాలు పూర్తికాగా ఇంకా 15.16 లక్షల పనిదినాలను 38 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంది. తక్కువ సమయం ఉండటంతో కూలీల హాజరుశాతం మ రింత పెంచాలని అధికారులు ఫీల్డ్‌ అసిస్టెంట్లపై ఒత్తిడి పెంచుతున్నారు. ఉపాధి కూలీలకు ప్రభు త్వం రూ.300పైగా వేతనం ఇస్తుడటంతో కూలీలు కూడా పనులకు వచ్చేందుకు మొగ్గుచూపుతున్నా రు. పనిదినాల సంఖ్య పెంచడానికి రెండేళ్ల క్రితం ఆగిపోయిన చెరువుల్లో మట్టి పూడిక తీసే పనులను అధికారులు మళ్లీ ప్రారంభించారు.

ప్రతి గ్రామ పంచాయతీలో వంద మందికి తగ్గకుండా కూలీలు పనులకు రావాలి. పెద్ద జీపీల్లో 200 మంది వచ్చేలా చూడాలి. ఈ విషయంపై ఫీల్డ్‌ అసిస్టెంట్లకు, ఏపీవోలకు ఆదేశాలిచ్చాం. కూలీల సంఖ్య పెంచే విషయంలో నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు ఉంటాయి. బాగా పని చేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుంది. – సాయన్న, డీఆర్డీవో, నిజామాబాద్‌

ఉపాధి హామీ పనులపై

డీఆర్డీవో ఆదేశాలు

ప్రతి జీపీలో హాజరుశాతం

పెంచాల్సిందేనని స్పష్టం

పర్యవేక్షణ పెంచిన ఎంపీడీవోలు,

ఏపీవోలు

Advertisement
 
Advertisement
Advertisement