ప్రజారవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన ఆర్టీసీ సంస్థకు చెందిన కార్మికులు మంగళవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపునివ్వడంతో ఆర్టీసీ అధికారులం అప్రమత్తమయ్యాం. సమ్మెకు ప్రత్యామ్నాయంగా అద్దె బస్సులను ఎక్కువ మొత్తంలో నడుపుతున్నాం. సమ్మె కాలంలో కార్మికులకు ఎలాంటి వేతనాలు చెల్లించబడవు. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా ప్రజారవాణా వ్యవస్థకు సంబంధించి సమ్మె కాలం పాటు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల యజమానులతో మాట్లాడి ఎక్కువ మొత్తంలో బస్సులు నడిపే విధంగా చొరవ తీసుకుంటాం. ఇప్పటికే జిల్లా మొత్తం 650 సర్వీసులకుగాను 206 సర్వీస్‌లను నడిపినట్లు ఆమె తెలిపారు.
–జోత్స్న, ఆర్టీసీ ఆర్‌ఎం, నిజామాబాద్


