సుభాష్‌నగర్: అఖిల భారత ఆదివాసీ కాంగ్రెస్ జిల్లాల అధ్యక్షులతో బుధవారం ఢిల్లీలో నిర్వహించిన లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ మిషన్ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా గిరిజన, ఆదివాసీ చైర్మన్ కెతావత్ యాదగిరి హాజరయ్యారు. సమావేశానికి కాంగ్రెస్ లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ హాజరై దిశానిర్దేశం చేశారు. కెతావత్ యాదగిరి మాట్లాడుతూ.. ఆదివాసీలు దేశానికి వెన్నుముక లాంటి వారని, ఆదివాసీలు, బంజారాల సంస్కృతిని కాంగ్రెస్ గౌరవించి అభివృద్ధి చేసిందని గుర్తుచేశారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు వారి వారి జిల్లాల్లో లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ కోసం కృషి చేయాలని, బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నా రు. కార్యక్రమంలో అఖిల భారత ఆదివాసీ కాంగ్రె స్ చైర్మన్ విక్రాంత్ బూరియా, జాతీయ నాయకులు కొప్పుల రాజు, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ శంకర్ నా యక్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, జిల్లా నాయకులు కెతావత్ సురేశ్ నాయక్ పాల్గొన్నారు.


