ఎండల తీవ్రత పెరుగుతోంది. ప్రజలు భానుడి భగభగలను భరించలేకపోతున్నారు. జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం భీమ్‌గల్‌లో అత్యధికంగా 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వేడిగాలుల కారణంగా జనం బయటికి వచ్చేందుకు ప్రజలకు జంకుతున్నారు. జిల్లా కేంద్రంతోపాటు మండల కేంద్రాల్లోని ప్రధాన రోడ్లు మధ్యా హ్నం వేళ నిర్మానుష్యంగా మారుతున్నాయి. తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చిన వారు ఎండతీవ్రత నుంచి తమను తాము రక్షించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్


