ప్రధాని మోదీకి మల్లికార్జున్‌ ఖర్గే క్షమాపణ చెప్పాలి | - | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీకి మల్లికార్జున్‌ ఖర్గే క్షమాపణ చెప్పాలి

Apr 23 2026 7:24 AM | Updated on Apr 23 2026 7:24 AM

పెండింగ్‌ కేసులను పరిష్కరించాలి జీజీ కళాశాలలో పరీక్షలు

బీజేపీ జిల్లా అధ్యక్షుడు

దినేష్‌ పటేల్‌ కులాచారి

సుభాష్‌నగర్‌: కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ప్రధాని మోదీని ఉగ్రవాది అని సంబోధించడం ఆ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనమని, వెంటనే ప్రధానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్‌ కులాచారి బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ప్రధానిపై ఖర్గే చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉగ్రవాదులతో కలిసి బిర్యానీలు తిని, స్నేహం చేసిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదని ఆరోపించారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో కశ్మీర్‌ వేర్పాటువాది, ఉగ్రవాది యాసిన్‌ మాలిక్‌తో ఢిల్లీలో అధికారికంగా చర్చలు జరిపిన విషయాన్ని ఖర్గే మర్చిపోయారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పూర్తిగా అర్బన్‌ నక్సలైట్‌ పార్టీగా మారిపోయిందని విమర్శించారు. దేశంలో మెజార్టీ ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రధాని మోదీని అవమానించిన మల్లికార్జున ఖర్గే వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే దేశ ప్రజలే కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.

సీపీ సాయి చైతన్య

నిజామాబాద్‌ అర్బన్‌: పెండింగ్‌లో ఉన్న కేసు ల పురోగతిని వేగవంతంగా పూర్తి చేయాలని ిసీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. బుధవారం కమిషనరేట్‌ కార్యాలయంలో సీఎంఆర్‌ కేసులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రతి కేసును ప్రాధాన్యతతో తీసుకొని నిర్ధిష్ట గడువులోగా పూర్తి చేయాలన్నారు. కేసుల దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలన్నారు. ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెరిగేలా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. సమావేశంలో ఆర్మూర్‌ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, ఎస్‌బీ సీఐ శ్రీధర్‌రెడ్డి, అశోక్‌, సీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్‌ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

ఖలీల్‌వాడి: నగరంలోని దుబ్బాలో ఉన్న జీజీ కళాశాలలో బుధవారం నిర్వహించిన 2వ సెమిస్టర్‌ పరీక్షలకు 1221 మందికి 1191 మంది హాజరు కాగా 30 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు పరీక్షల నియంత్రణాధికారి భరత్‌రాజ్‌, ప్రిన్సిపాల్‌ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. 6వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలకు విద్యార్థులందరూ హాజరయ్యారని వారు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement