● డిమాండ్ల పరిష్కారానికి
ప్రభుత్వం సిద్ధంగా ఉంది
● కాంగ్రెస్ పార్టీ జిల్లా
అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి
నిజామాబాద్ రూరల్: ఆర్టీసీ కార్మికుల డిమాండ్‌లను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి, నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. బుధవారం ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న సమ్మెను విరమింపజేసేలా వారితో చర్చలు జరపాలని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొ న్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు వారు ఆర్టీసీ ఉద్యోగులు,కార్మికులను కలిసి మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభు త్వం ఆర్టీసీకి అన్ని విధాలుగా సహాయం చేస్తుందని, కార్మికులు చెప్పిన డిమాండ్లను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు. కార్మికులు చెప్పిన 32 డిమాండ్లలో ఇప్పటికే 29 డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిందని, మిగిలిన మూడు డిమాండ్లను కూడా త్వరలోనే సీఎం నెరవేర్చే ప్రయత్నం చేస్తారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ మెంబర్ రామకృష్ణ, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రత్నాకర్‌గౌడ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వెంకట్రావు రెడ్డి, గోపి గాదరి, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, కార్పొరేటర్ మనోహర్, నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు వినయ్, యూత్ కాంగ్రెస్ నగర అధ్యక్షుడు మెయిన్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.


