తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల – 2026 మొదటి సెమిస్టర్ ఫలితాలను బుధవారం వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ టీ యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఎం యాదగిరి విడుదల చేశారు. వీసీ మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరమే ప్రా రంభమైన ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్ కంప్యూటర్ సైన్స్, బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల మొదటి సెమిస్టర్ పరీ క్షా ఫలితాలను ఆవిష్కరించినట్లు తెలిపారు. బీటెక్ కంప్యూటర్ సైన్స్‌లో 56 మందికి 32 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు పేర్కొన్నారు.బీటెక్ కంప్యూట ర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులో 15 మందికి 9 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఎం యాదగిరి, ప రీక్షల నియంత్రణాధికారి కే సంపత్‌కుమార్, అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ ఆరతి,అడిషన ల్ కంట్రోలర్ టీ సంపత్,అధ్యాపకులు నందిని, భ్ర మరాంబిక,శాంతాబాయి పాల్గొన్నారు.
తెయూ ఇంజినీరింగ్ సెమిస్టర్ ఫలితాలను విడుదల చేస్తున్న వీసీ, రిజిస్ట్రార్


