కుక్కల దాడిలో పలువురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

కుక్కల దాడిలో పలువురికి గాయాలు

Apr 23 2026 7:24 AM | Updated on Apr 23 2026 7:24 AM

కుక్కల దాడిలో పలువురికి గాయాలు దాడికి పాల్పడ్డ ఒకరి రిమాండ్‌

లింగంపేట: మండలంలోని భవానిపేట గ్రామంలో బుధవారం వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. గ్రామానికి చెందిన ఉపసర్పంచ్‌ అస్కుల సాయిలు, బేస్త మమతతో పాటు పలువురిపై వీధి కుక్కలు దాడికి పాల్పడ్డాయి. దీంతో గాయపడిన వారిని గ్రామస్తులు అంబులెన్సులో ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుక్కలు మనుషులతో పాటు ఆవులు, మేకలపై దాడి చేసి గాయపర్చినట్లు గ్రామస్తులు తెలిపారు. కొంత కాలంగా కుక్కల బెడద తీవ్రంగా ఉందని అధికారులు, పాలకులు స్పందించి కుక్కల బెడదను నివారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఆర్మూర్‌టౌన్‌: ఆర్మూర్‌ పట్టణంలో సుదర్శన్‌ అనే వ్యక్తిపై పాత కక్షలతో ఇటీవల దాడికి పాల్పడిన బా శెట్టి హర్షవర్ధన్‌ను బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ గౌడ్‌ తెలిపారు.వివరాలిలా ఉన్నాయి. స్థానికంగా ఉ న్న ఓ మిల్క్‌సెంటర్‌లో పనిచేస్తున్న సుదర్శన్‌పై పా త గొడవలతో అదే ప్రాంతంలో ఉన్న మాధవ్‌ అనే వ్యక్తి సుదర్శన్‌ కళ్లలో కారం చెల్లి స్క్రూడ్రైవర్‌తో తలపై బాది చంపడానికి ప్రయత్నించారు. పక్కనే ఉన్న దుకాణాదారులు చూసి వెంటనే వచ్చి సుదర్శన్‌ను కాపాడారు. బాధితుడు సుదర్శన్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలోఉన్న హర్షవర్ధన్‌ను ఉదయం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement