వర్సిటీ పాలకమండలి సభ్యులకు సన్మానం | - | Sakshi
Sakshi News home page

వర్సిటీ పాలకమండలి సభ్యులకు సన్మానం

Apr 22 2026 9:30 AM | Updated on Apr 22 2026 9:30 AM

తెయూ(డిచ్‌పల్లి) : నూతనంగా నియామకమైన తె లంగాణ యూనివర్సిటీ పాలకమండలి (ఈసీ) స భ్యులను సోమవారం వీసీ ప్రొఫెసర్‌ టి.యాదగిరి రావు, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం.యాదగిరి వర్సిటీలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వీసీ, రి జిస్ట్రార్‌లు యూనివర్సిటీ పనితీరు, కొనసాగుతు న్న అభివృద్ధి పనులను ఈసీ మెంబర్లకు వివరించా రు. వర్సిటీ అభివృద్ధికి అన్నివేళలా అందుబాటులో ఉంటామని ఈసీ మెంబర్లు హామీ ఇచ్చారు. అనంతరం ఈసీ మెంబర్లు వీసీ, రిజిస్ట్రార్‌లను శాలువా లతో సత్కరించారు. కార్యక్రమంలో నూతన పాలకమండలి సభ్యులు ప్రొఫెసర్‌ సీహెచ్‌ ఆంజనేయులు (తెయూ), ఆర్‌.సుధాకర్‌గౌడ్‌ (తెయూ, సౌత్‌ క్యాంపస్‌), కే సంజీవరావు (గౌతమి పీజీ కాలేజీ), దండు స్వామి (జీజీసీ), మదన్‌ మోహన్‌ దేవబక్తుని (ఇందూరు పీజీ కాలేజీ), చెరుకూరి రజినీకాంత్‌ (కాకతీయ విద్యాసంస్థలు), అల్లె లావణ్య (సాలూరా), మహమ్మద్‌ ఘాజీ (కామారెడ్డి), డాక్టర్‌ ఎస్‌.జయంత్‌ (అనురాగ్‌ యూనివర్సిటీ)తోపాటు అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ సాయాగౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement