యూనివర్సిటీ వార్షికోత్సవ బ్రోచర్‌ ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

యూనివర్సిటీ వార్షికోత్సవ బ్రోచర్‌ ఆవిష్కరణ

Apr 22 2026 9:30 AM | Updated on Apr 22 2026 9:30 AM

ముఖ్యఅతిథిగా హాజరుకానున్న

ఎమ్మెల్సీ గోరటి వెంకన్న

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో ఈ నెల 22న నిర్వహించబోయే వార్షికోత్సవ వేడుకలకు సంబంధించిన బ్రోచర్‌ను సోమవారం తన చాంబర్‌లో వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ టి.యాదగిరిరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షికోత్సవానికి ఎమ్మెల్సీ, ప్రజావాగ్గేయకారుడు గోరటి వెంకన్న ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని అన్నారు. వార్షికోత్సవ కమిటీలన్నీ త్వరితగతిన పనులు పూర్తిచేసి వేడుకల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో కమిటీల కన్వీనర్లు రాంబాబు, లావణ్య, సీహెచ్‌ ఆరతి, కే అపర్ణ, డాక్టర్‌ బాలకిషన్‌, డాక్టర్‌ నందిని తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement