బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే రెండేళ్ల జైలు | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే రెండేళ్ల జైలు

Apr 22 2026 9:30 AM | Updated on Apr 22 2026 9:30 AM

బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే రెండేళ్ల జైలు

బోధన్‌టౌన్‌(బోధన్‌): బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించినా చట్టం ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష, రూ. లక్ష వరకు జరిమానా ఉంటుందని డీహెచ్‌ఈడబ్ల్యూ జిల్లా సమన్వయకర్త స్వప్న హెచ్చరించారు. పట్టణంలోని రాకాసీపేట్‌, గాంధీగర్‌నగర్‌ కాలనీ అంగన్‌వాడీ సెంటర్లలో మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో ‘బేటీ బచావో.. బేటీ పఢావో’ కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. ఈ సఽందర్భంగా స్వప్న మాట్లాడుతూ బాల్య వివాహాలతో అనేక అనర్థాలు జరుగుతాయని, ఆడపిల్లల చదువు కుంటుపడుతుందని, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని అన్నారు. మహిళలంతా ఏకమై బాల్య వివాహాలను నిర్మూలించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ రాధిక, అంగన్‌వాడీ టీచర్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement