తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ వర్సిటీ పరిధిలో డిగ్రీ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగినట్లు అడకమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో ఏర్పాటు చేసిన మొత్తం 29 పరీక్ష కేంద్రాలలో 5,375 మంది విద్యార్థులకు 5,183 మంది హాజరుకాగా 192 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తనిఖీ చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, కాపీయింగ్‌కు అవకాశం ఇవ్వొద్ద ని ఇన్విజిలేటర్లకు సూచించారు.


