నిజామాబాద్ అర్బన్ : డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వాలని డెస్క్ జర్నలిస్టుల యూనియన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ విషయమై సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డెస్క్ జర్నలిస్టులు మాట్లాడుతూ ప్రస్తుతం జారీ చేసిన జీవో ప్రకారం అర్హులైన చాలా మంది డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం జరిగే అవకాశాలున్నాయన్నారు. ఇటీవల జారీ చేసిన జీవోకు సవరణలు చేసి డెస్క్ జర్నలిస్టులు అందరికీ ఎడిషన్ కేంద్రంలోనే అక్రెడిటేషన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో సాక్షి నిజామాబాద్ బ్యూరో ప్రతినిధి భద్రారెడ్డి, సాక్షి టీవి ప్రతినిధి కిరణ్‌కుమార్‌రెడ్డి, వివిధ పత్రికల్లో పనిచేస్తున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన డెస్క్ జర్నలిస్టులు వెంకటరమణ, భీంరావు, స్వామి, రాకేశ్, మహేశ్, నర్సింగ్‌రావు, సంతోష్, జర్నలిస్టులు రాజ్‌కుమార్, భూమేశ్ పాల్గొన్నారు.


