న్యూస్‌రీల్
నిజామాబాద్
జాగ్రత్తలు పాటించాలి
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు.
బుధవారం శ్రీ 22 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
– 8లో u
మాక్లూర్ మండలం కల్లెడి గ్రామానికి చెందిన ఐదేళ్ల బాలుడు బండారి నిహాన్ష్ 2023 డిసెంబర్ 25న తాత ధర్మయ్యతో కలిసి సరదాగా వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు. మనవడు పొలం గట్టుపై కూర్చుని ఉండగా తాత పనిలో నిమగ్నమయ్యాడు. అంతలోనే గుంపుగా వచ్చిన కుక్కలు నిహాన్ష్‌పై దాడి చేశాయి. తీవ్ర గాయాలపాలైన నిహాన్ష్‌ను తల్లిదండ్రులు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించి వ్యాక్సిన్ వేశారు. మూడు రోజులకోసారి మరికొన్ని వ్యాక్సిన్లు వేయించాల్సి ఉంటుందని వైద్యులు సూచించారు. ఇంటికి వెళ్లిన మూడు రోజులకు నిహాన్ష్ తీవ్రజ్వరంతో బాధపడుతూ వాంతులు చేసుకోవడంతో తల్లిదండ్రులు అతడిని ప్రైవేట్ ఆస్పత్రికి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా కన్నుమూశాడు. బాలుడి మృతి అందరినీ కలిచివేసింది.
గుంపులు గుంపులుగా తిరుగుతున్న వీధి కుక్కలు వణికిస్తున్నాయి. ఏదో ఓ చోట పిల్లలతోపాటు పెద్దలపైనా దాడులు చేస్తున్నాయి. గత నెలలో ఏకంగా 52 మంది కుక్కల దాడిలో గాయపడి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చారు. ఈనెలలో ఇప్పటికే 31 మంది కుక్కకాటుకు గురయ్యారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో బాలికను కుక్కలు పీక్కుతున్న ఘటనతో ప్రజలు ఉలిక్కిపడ్డారు.


