ఇందూరు పసుపు ధర్మాబాద్‌ కారం | - | Sakshi
Sakshi News home page

ఇందూరు పసుపు ధర్మాబాద్‌ కారం

Apr 22 2026 7:54 AM | Updated on Apr 22 2026 7:54 AM

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ఇందూరులో పెద్ద స్థాయిలో పసుపు మార్కెట్‌ నడుస్తుండడంతో ఇక్కడి పసుపునకు ప్రత్యేకత ఉంది. జిల్లాతోపా టు చుట్టుపక్కల జగిత్యాల, నిర్మల్‌ జిల్లాల్లో పండించిన పుసుపు నిజామాబాద్‌ వ్యవసాయ మా ర్కెట్‌ ద్వారా దేశవిదేశాలకు ఎగుమతి అవుతోంది. అయితే ఇందూరు పసుపు బ్రాండ్‌తోపాటు ధర్మాబాద్‌ కారం సైతం ఈ ప్రాంతంలో అంతే బ్రాండ్‌గా నిలుస్తోంది. ‘ఇందూరు పసుపు– ధర్మాబాద్‌ కారం’ ఇక్కడ స్పెషల్‌. నిజామాబాద్‌ జిల్లాలో కారం వ్యాపారులు సరిహద్దు మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో ఉన్న ధర్మాబాద్‌ పట్ట ణం పేరుతో ‘ధర్మాబాద్‌ కారం’ అని బ్రాండింగ్‌ చేస్తూ బిజినెస్‌ చేస్తున్నారు. జిల్లాకు ఆనుకుని మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో ఉన్న ధర్మాబా ద్‌ పట్టణానికి.. నిజామాబాద్‌ నగరానికి మధ్య రైల్వే సౌకర్యం ఉంది. దీంతో ప్రత్యేకంగా కారం కోసమే నిజామాబాద్‌, నిర్మల్‌, కామారెడ్డి జిల్లా ల నుంచి ధర్మాబాద్‌ వెళ్లడం నిత్యకృత్యంగా ఉంటోంది. దీంతో కారం రిటైల్‌ మార్కెట్‌ విషయంలో ధర్మాబాద్‌ తన ప్రత్యేకత నిలుపుకుంటూ వ స్తోంది. అనేక ఏళ్లుగా ధర్మాబాద్‌ అంటేనే కారం గుర్తుకొచ్చే పరిస్థితి. మహారాష్ట్రకు చివరి భాగంలో తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ధర్మాబాద్‌ అనే చిన్న పట్టణం భారీ స్థాయిలో ఒక్క కారం విష యంలోనే రిటైల్‌ మార్కెట్‌లో ఇంతటి పేరు పొందడం విశేషం. ధర్మాబాద్‌ మహారాష్ట్రలో ఉన్నప్పటికీ నిజామాబాద్‌ జిల్లా ప్రజలు మా త్రం భావోద్వేగ అనుబంధం పెంచుకుని, అక్క డి కారంపై మమకారం చూపుతుండడం మరింత ప్రత్యేకం.

వరంగల్‌, ఖమ్మం, గుంటూరు, హైదరాబాద్‌ నుంచి ధర్మాబాద్‌కు మిర్చి..

ధర్మాబాద్‌ కారం పరిశ్రమలకు తెలంగాణలోని వరంగల్‌, ఖమ్మం, మలక్‌పేట (హైదరాబాద్‌), ఏపీలోని గుంటూరు, మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ మార్కెట్ల నుంచి మిర్చి వస్తుంది. ధర్మాబాద్‌ వ్యాపారులు ఆయా ప్రాంతాలకు వెళ్లి ఎండు మిర్చి కొనుగోలు చేసుకుని వస్తారు. వీటిలో తేజ, గుంటూరు రకాలు, సీ–5, 273 రకాలు ఉన్నాయి. ఇక్కడ కారంతో పాటు పసుపు, మసాలాలు సైతం రిటైల్‌గా భారీ స్థాయిలోనే అమ్ముతారు.

కొవిడ్‌ తరువాత వ్యాపారం తగ్గింది

కొవిడ్‌, లాక్‌డౌన్‌కు ముందు కారం వ్యాపారం భారీ స్థాయిలో ఉండేది. మా కారం పరిశ్రమలకు రెండు రాష్ట్రాల్లో గుర్తింపు ఉండేది. లాక్‌డౌన్‌ తరువాత నుంచి గతంలో మాదిరి వ్యాపారం లేకుండా పోయింది. మరోవైపు తెలంగాణ, ఏపీ మార్కెట్లలో ఎండు మిర్చి ధరలు బాగా పెరిగాయి. గతంలో క్వింటా మిర్చి రూ.12వేలు ఉండగా, ప్రస్తుతం రూ.22వేలు ఉంది. దీంతో వ్యాపారం ఆశించిన మేర చేయలేకపోతున్నాం. – మురళీధర్‌ నాగ్ల,

ధర్మాబాద్‌ కారం వ్యాపారుల సంఘం అధ్యక్షుడు

రెండు ప్రాంతాల మధ్య వీటికోసం ప్రత్యేకంగా ప్రయాణం

కారం రిటైల్‌ మార్కెట్‌కు

ధర్మాబాద్‌ ఫేమస్‌

పసుపుతో కళకళలాడుతున్న

నిజామాబాద్‌ మార్కెట్‌

Advertisement
 
Advertisement
Advertisement