● మంగళవారం అర్ధరాత్రి నుంచే
బస్సులు బంద్
నిజామాబాద్ రూరల్: ప్రభుత్వంతో జరిపిన చర్చ లు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో మంగళవారం అర్ధరాత్రి నుంచే జి ల్లాలో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సంస్థలోని 10 యూనియన్లు ఒకతాటిపైకి రావడంతో కార్మికులందరు ఏకమై సమ్మెకు పిలుపునిచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాల పునరుద్ధరణ, ఎలక్ట్రిక్ బస్సుల వ్యవహారంపై సీఎం స్పందించాలంటూ ఇటీవల కార్మికులు కోరిన విషయం తెలిసిందే. కానీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా ఆర్టీసీలోని ప్రయివేట్ బస్సులను మాత్రం యథావిధిగా నడపనున్నట్లు యజమానులు తెలిపారు.


