ఇటుక బట్టీ కార్మికులకు గుర్తింపుకార్డులు | - | Sakshi
Sakshi News home page

ఇటుక బట్టీ కార్మికులకు గుర్తింపుకార్డులు

Apr 22 2026 7:54 AM | Updated on Apr 22 2026 7:54 AM

రెంజల్‌(బోధన్‌): మండలంలోని ఇటుక బట్టీల్లో పని చేసే అసంఘటిత కార్మికులకు గుర్తింపు కార్డుల ను అందిస్తున్నట్లు తహసీల్దార్‌ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు. మండలంలో 6 ఇటుక బట్టీలు ఉండగా అందులో సుమారు 26 మంది కార్మికులు ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయానికి జిల్లా సహయ కార్మిక శాఖ సిబ్బందిని పిలిపించి కార్మికుల వివరాలను నమో దు చేయించారు. కార్మికులకు సంబంధించిన ఆధా ర్‌కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం, రేషన్‌కార్డు, పాస్‌ఫోటోలతో మీసేవ కేంద్రాల్లో ఇటుక బట్టీ నిర్వాహకులచే దరఖాస్తు చేయించారు. జిల్లా సహయ కార్మి క శాఖ అధికారి పరిశీలించే కార్డును జారీ చేస్తారని పేర్కొన్నారు. కార్డు లభించిన మహిళా కార్మికులకు మొదటి, రెండవ ప్రసవాలకు రూ. 30 వేల చొప్పున, మహిళా కార్మికుల ఇద్దరు కుమార్తెలకు ఒక్కొక్కరికి రూ. 30 వేలతో పాటు ప్రసవ సమయంలో సైతం రూ. 30 వేల చొప్పున అందించడం జరుగుతుందన్నారు. కార్మికులు సహజ మరణం పొందితే రూ. లక్షా 30 వేలు, ప్రమాదావశాత్తు మృతిచెందితే రూ. 6 లక్షల 30 వేలు, అంగవైకల్యానికి గురైతే రూ. 30 వేల నుంచి 5 లక్షల వరకు ప్రభుత్వం కార్మిక శాఖ ద్వార పరిహారం అందిస్తుందన్నారు. కార్మికులందరు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకునేలా ఇటుక బట్టీల నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement