నవీపేట : మండలంలోని మాన్‌సింగ్‌తండాకు చెందిన రాథోడ్ మురళి(45)తన కుమారుడు రా థోడ్ రాజేశ్ చేతిలో హత్యకు గురైనట్లు ఎస్సై శ్రీ కాంత్ మంగళవారం తెలిపారు. ఆయన కథనం మేరకు...మాన్‌సింగ్ తండాకు చెందిన రాథోడ్ రా జేశ్ మద్యానికి బానిసై తరచూ తల్లిదండ్రులతో గొడవపడేవాడు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి మద్యం తాగి వచ్చి రాజే శ్ తల్లి లక్ష్మి, పిన్ని లతలతో గొడవపడ్డాడు. ఇంట్లో ఉన్న తండ్రి రాథోడ్ మురళి అడ్డు వెళ్లగా రాయితో అతడి తలపై రాజేశ్ బలంగా కొట్టాడు. తీ వ్ర రక్తస్రావం కావడంతో జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. చికి త్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
అక్బర్‌నగర్ వద్ద ఆటో బోల్తా
రుద్రూర్: మండలంలోని అక్బర్‌నగర్ శివారులో మంగళవారం సాయంత్రం ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడిన ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వర్ని నుంచి ఆటో వస్తుండగా మూల మలుపు వద్ద ప్రమాదం జరిగింది. రుద్రూర్‌కు చెందిన లక్ష్మి, దత్తు, ఐదేళ్ల బాబుతో పాటు మరికొందరు గాయపడినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.


