నిజామాబాద్ రూరల్: ప్రపంచ దేశాలకు ఆదర్శనీయమైన మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని పలువురు వక్తలు అన్నా రు. నగరంలోని నీలకంఠ బిస్తీ ఆధ్వర్యంలో శ్రీరా మ గార్డెన్‌లో హిందూ సమ్మేళనం నిర్వహించారు. సమ్మేళనానికి ఆర్‌ఎస్‌ఎస్ ఇందూర్ విభాగ్ సహకార్యవాహ వరంగంటి శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. హిందువులకు తమ కర్తవ్యాన్ని గుర్తు చేయడం కోస మే హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి దేశ, దైవభక్తి కలిగి ఉండాలని ఇ స్కాన్ కంఠేశ్వర్ కేంద్ర వ్యవస్థాపక అధ్యక్షుడు రా మానంద రాయ్ గౌరదాస్ ప్రభుజీ అన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అ లరించాయి. కార్యక్రమంలో హిందూ సమ్మేళన స మితి అధ్యక్షుడు ఉసెం రమేశ్‌రెడ్డి, ప్రధాన కార్య దర్శి గంగుల అశోక్, కోశాధికారి భాగవత పురుషోత్తం శర్మ, కార్యవర్గ సభ్యులు భూమేశ్వర్, చంద్రమోహన్, నాగేశ్వర్ రావు, గోపి, పాండురంగారా వు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని సీతారాంనగర్ కాలనీలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. సమ్మేళనానికి మల్లారం గుట్ట ఆశ్ర మ వ్యవస్థాపకులు బాలయోగి పిట్లకృష్ణ మహరాజ్ హాజరై మాట్లాడారు. భారతదేశం కుటుంబ వ్యవస్థపై ఆధారపడి ఉందని అన్నారు. నగరంలోని నీల కంఠేశ్వర ఆలయంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. సమ్మేళనానికి తెలంగాణ సహప్రాంత ప్రచారక్ కల్పగురి ప్రభుకుమార్, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ హాజరై మాట్లాడారు. దేశ ధర్మ రక్షణకు రాష్ట్రీయ స్వయంసేవక సంఘం వందేళ్లుగా నిరంతరాయంగా కృషి చేస్తోందని, హిందూ సంస్కృతిని కాపాడటం ప్రతి హిందువు బాధ్య త అని వారు అన్నారు. కార్యక్రమంలో పలుగుట్ట ఆ శ్రమ వ్యవస్థాపకులు కేదారానంద స్వామీజీ, సేవి కా సమితి బౌద్ధిక్ ప్రముఖ్ కల్పన, హిందూ సమ్మే ళనం కమిటీ అధ్యక్షుడు విజయ్ కుమార్, నగర సే వ ప్రముఖ్ బాబురావు, కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, అధ్యక్షులు గంగుల విజయ్ నాగోల్ల రవికుమార్, భక్తులు పాల్గొన్నారు.
హిందూ సమ్మేళనాల్లో వక్తలు


