మోర్తాడ్: యాసంగి సీజన్‌కుగాను సాగు చేసిన దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్ రొక్కం మురళి అన్నారు. దొడ్డు రకాల కొనుగోలుపై రెండు రో జుల్లో సానుకూలమైన సమాధానం వస్తుందని ఆయన వెల్లడించారు. మంగళవారం తిమ్మాపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాయకులు చిన్న రాజేశ్వర్, అజారొద్దీన్, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
బోధన్‌టౌన్(బోధన్): తెలంగాణ రాష్ట్ర మైనారిటీ హక్కుల పోరాట సమితి నిజామాబాద్ జిల్లా కన్వీనర్‌గా బోధన్ పట్టణానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ బషీర్ ఎన్నిక అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాపై నమ్మకంతో జిల్లా కన్వీనర్‌గా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ వాహబ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ వసీమ్‌లకు ధన్యావాదాలు తెలిపారు.
డిచ్‌పల్లి: మండలంలోని ధర్మారం(బి) గ్రామంలో శ్రీదేవీ శ్రీభూదేవీ సహిత వేంకటేశ్వరస్వామి దేవాలయ సముదాయముంలో ఆలయాల 14వ వార్షికోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీవిజయగణపతి, శ్రీఅభయాంజనేయ స్వామి, నవగ్రహ అభిషేకాలు, శ్రీగణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనము, గోపూజ, ధ్వజారోహణం, ధ్వజారోహణం, ఉమా మహేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకం, అన్నపూజ నిర్వహించారు. సాయంత్రం ఆదిశంకరాచార్య జయంతి నిర్వహించిన తర్వాత కనుల పండువగా శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. అన్న పూజలో హంపీ పీఠాథిపతి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అనుగ్రహ భాషణం ఇచ్చారు. ఆలయ కమిటీ నిర్వాహకులు రావుల బ్రహ్మనందం, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాల్లో మానాల..
కమ్మర్‌పల్లి: కమ్మర్‌పల్లి మండలం శ్రీరాజరాజేశ్వరీనగర్‌లో శ్రీలక్ష్మీనరసింహస్వామి ఉత్సవాల్లో మంగళవారం రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సుంకెట రవి, నాయకులు కొమ్ముల రవీందర్‌రెడ్డి, సర్పంచ్ శైలేందర్, భాస్కర్, తిప్పిరెడ్డి శ్రీను తదితరులున్నారు.
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బదిలీపై వెళ్తున్న అదనపు డీసీపీ బస్వారెడ్డిని సీపీ సాయిచైతన్య మంగళవారం ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. సీపీ సాయి చైతన్య బస్వారెడ్డికి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యులు కవితా రెడ్డి, రజినీకాంత్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


