● యువత డ్రగ్స్, ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు
దూరంగా ఉండాలి
● సీపీ సాయి చైతన్య
బోధన్‌టౌన్ : ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు పాటించాలని సీపీ సాయిచైతన్య అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బోధన్ డివిజన్ పరిధిలో కొత్తగా ఎన్నికై న గ్రామ సర్పంచులు, కౌన్సిలర్‌లతో మన ఊరు – మన భద్రత – మన బాధ్యత కార్యక్రమాన్ని బోధన్‌లోని లయన్స్ క్లబ్ కంటి ఆస్పత్రి సమావేశపు హాల్‌లో మంగళవారం నిర్వహించారు. ఈకార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు. రైతులు రోడ్ల పై ధాన్యం ఆరబెట్టినప్పుడు భ ద్రత కోన్లు, బకెట్ పెట్టి స్టిక్కర్లు అంటించాలని అన్నారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకూడదన్నారు. యువత డ్రగ్స్‌కు, ఆన్‌లైన్ బెట్టింగ్‌కు దూరంగా ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాలతో ఎక్కువ మంది మృత్యువాత పడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాన్నారు. ఏసీపీ శ్రీనివాస్, సైబర్‌క్రైం ఏసీపీ వెంకటేశ్వర్‌రావు, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, మున్సిపల్ చైర్‌పర్సన్ తూము పద్మాశరత్‌రెడ్డి, వైస్ చైర్మన్ ఇలియాస్ అలీ, పట్టణ సీఐ వెంకటనారాయణ, ఎంవీఐ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్‌బాబు, ఎన్‌ఎస్‌సీ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ సాంబ శివరావ్, ఎన్‌ఎస్‌సీ మెంబర్ దుష్యంత్, కొడాలి కిశోర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


