ప్రతి గింజ కొంటున్నాం.. | - | Sakshi
Sakshi News home page

ప్రతి గింజ కొంటున్నాం..

Apr 22 2026 7:54 AM | Updated on Apr 22 2026 7:54 AM

నిజామాబాద్‌ రూరల్‌: రైతులు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేస్తుందని రూరల్‌ ఎమ్మెల్యే డా.ఆర్‌.భూపతిరెడ్డి పే ర్కొన్నారు. మంగళవారం మోపాల్‌ మండలం ఎల్లమ్మకుంట గ్రామంలో బాడ్సి పీఏసీఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రా న్ని మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇందిరమ్మ లబ్ధిదారు సునీత– సుధాకర్‌ గృహ ప్రవేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వం జిల్లాలో 739 కొనుగో లు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ ముప్ప గంగారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు సాయరెడ్డి, ిపీసీసీ డెలిగేట్‌ శేఖర్‌ గౌడ్‌, సర్పంచ్‌ ఫోరం జిల్లా అధ్యక్షుడు మునిపల్లి సాయిరెడ్డి, తారాచంద్‌ నాయక్‌,డివిజన్‌ నంబర్‌ 1 కార్పొరేటర్‌ అగ్గు భోజన్న, సర్పంచులు, నా యకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

చెక్‌డ్యాంకు మరమ్మతులు చేయించాలని వినతి

సిరికొండ: మండలంలోని గడ్కోల్‌ గ్రామానికి చెందిన రైతులు ఎమ్మెల్యే భూపతిరెడ్డిని మంగళవారం కలిసి చెక్‌డ్యాంకు మరమ్మతులు చేయించాలని వి న్నవించారు. వర్షాకాలంలోపు మరమ్మతులు చే యించకపోతే మరిన్ని ఇబ్బందులు పడుతామని వా రు వాపోయారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భా స్కర్‌రెడ్డి, రైతులు కట్ట పెద్ద గంగారం, మంగళి స దానంద్‌, పెండ్లి రాములు, నర్సయ్య ఉన్నారు.

నిజామాబాద్‌ రూరల్‌: ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చే సిన ఎమ్మెల్యే భూపతి రెడ్డిని స్థానిక సర్పంచ్‌ రాజేందర్‌, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్‌ నారాయణ పలువురు గ్రామస్తులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం గ్రామంలోని పలు సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement