ఖలీల్‌వాడి: జేఈఈ మెయిన్స్ – 2026 ఫలితాల్లో ఇంటర్ చదువుతూ తొలి ప్రయత్నంలోనే ఆలిండియా ర్యాంకులను కాకతీయ విద్యార్థులు కై వనం చేసుకున్నట్లు కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ రామోజీరావు మంగళవారం తెలిపారు. సీనియర్ ఇంటర్ విద్యార్థులు ఎస్ హేమ(132), రాఖీ(1,763), రమాదేవి(2,800), బీ సంధ్య(2984) ఆలిండియా ర్యాంకులు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. 10 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌లో ఆలిండియా స్థాయి ర్యాంకులు సాధిస్తే 50 మంది విద్యార్థులు ఐఐటీ అడ్వాన్స్‌కు అర్హత సాధించారని అన్నారు. దీనికి కృషి చేసిన అధ్యాపక బృందానికి, ప్రోత్సాహాన్ని అందించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ సీహెచ్ తేజస్విని మాట్లాడుతూ.. ప్రాథమిక దశ నుంచే ఐఐటీ ఓరియెంటెడ్ కోచింగ్ ఇవ్వడంతోనే ఇంతటి అద్భుత ఫలితాలను సాధించగలిగామని అన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ సీహెచ్ రాజా, ఐఐటీ అకాడమిక్ డీన్ నాగరాజు, ప్రిన్సిపాళ్లు సందీప్ జ్యోత్స్న, బీ రణదీశ్, వైస్ ప్రిన్సిపాల్ శ్యామ్ తదితరులు ఉన్నారు.


