దత్తాపూర్‌లో ఘనంగా హిందూ సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

దత్తాపూర్‌లో ఘనంగా హిందూ సమ్మేళనం

Apr 13 2026 8:20 AM | Updated on Apr 13 2026 8:20 AM

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): డొంకేశ్వర్‌ మండలం దత్తాపూర్‌ గ్రామంలోని శివదత్త ఆశ్రమం వేదికగా ఆదివారం రాత్రి నిర్వహించిన ‘హిందూ సమ్మేళనం’ ఘనంగా కొనసాగింది. నందిపేట్‌ పలుగుట్ట వ్యవస్థాకుడు కేదారానంద మహారాజ్‌, అంక్సాపూర్‌ జగత్‌ మహారాజ్‌, అమ్దాపూర్‌ అగ్గుస్వామి మహారాజ్‌, కంఠేశ్వర్‌ ఇస్కాన్‌ రామానంద ప్రభు, జాతీయ సాహిత్య పరిషత్‌ రాష్ట్ర కార్యదర్శి సూర్యనారాయణ, రాష్ట్ర సేవికా కమిటీ పొద్దుటూరి రూప సమ్మేళనానికి హాజరై మాట్లాడారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతి హిందువు బాధ్యతని వారు పేర్కొన్నారు. మహిళలను రుగ్మతల నుంచి రక్షించుకోవాలని, ప్రతి హిందూ కుటుంబంలో ధార్మిక అవగాహన పెరగాలన్నారు. పర్యావరణ హితవు కోసం అన్నదాన కార్యక్రమంలో స్టీల్‌ ప్లేట్లు, గ్లాసులను వినియోగించారు. సర్పంచ్‌ మూడ్‌ ప్రకాష్‌, హిందూ సమ్మేళన ఉత్సవ కమిటీ సభ్యులు, హిందూ బంధువులు, మహిళలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement