మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు ఘన స్వాగతం | - | Sakshi
Sakshi News home page

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు ఘన స్వాగతం

Apr 13 2026 7:20 AM | Updated on Apr 13 2026 7:20 AM

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు ఘన స్వాగతం హిందూ ధర్మానికి కట్టుబడి ఉండాలి ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం

సుభాష్‌నగర్‌: నిజామాబాద్‌ నగర పర్యటనకు ఆదివారం సాయంత్రం విచ్చేసిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌కు ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ దిలీప్‌కుమార్‌ ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా మంత్రిని దిలీప్‌కుమార్‌ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. మంత్రి వెంట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, నగర మేయర్‌ ఉమారాణి, రాష్ట్ర సహకార యూనియన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

కామారెడ్డి అర్బన్‌: ప్రతి హిందువు సంస్కృతి, సాంప్రదాయాలను పాటించడంతో పాటు మనసా, వాచా, కర్మణా హిందూ ధర్మానికి కట్టుబడి ఉండాలని జుక్కల్‌ సద్గురు గోపాల్‌రాందాస్‌ మూలే అన్నారు. కామారెడ్డి ఎన్జీవోస్‌ కాలనీ, కాకతీయనగర్‌ బస్తీ హిందూ ధర్మ సమ్మేళనం ఆదివారం రాత్రి శిశుమందిర్‌ హైస్కూల్‌ మైదానంలో నిర్వహించగా 2 వేల కు పైగా జనం తరలివచ్చారు. తొలుత గోమా తలకు పూజలు నిర్వహించారు. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ప్రధాన వక్త నర్రా వెంకట శివకుమార్‌, ప్రతినిధులు లక్ష్మీనర్స య్య, రాహుల్‌గౌడ్‌, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్స న్‌ ఇందుప్రియ, కౌన్సిలర్లు హర్షిత, ప్రభాకర్‌ యాదవ్‌,వినోదబాయి పాల్గొన్నారు.

భట్రాజు సంఘం

జిల్లా కార్యవర్గం ఎన్నిక

కామారెడ్డి అర్బన్‌: తెలంగాణ రాష్ట్ర భట్రాజు సంఘం కామారెడ్డి జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడిగా అర్వరాజు నరేందర్‌ రాజు, యూత్‌ అధ్యక్షుడిగా సాయి సుమంత్‌ విశ్వరాజు, మహిళా విభాగం అధ్యక్షురాలిగా బట్టు పద్మజ ఎన్నికయ్యారు. జిల్లాలో భట్రాజుల అభివృద్ధి, ఐక్యత, సామాజిక సేవల కోసం కృషి చేస్తామని ప్రమాణం చేశారు.

మాచారెడ్డి: అక్కాపూర్‌, ఘన్‌పూర్‌(ఎం) గ్రామాల్లో ఆదివారం మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేదింటి కల సాకారమైందని అన్నారు. అక్కాపూర్‌, ఘన్‌పూర్‌ గ్రామాల్లో మూడేసి ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు కట్న కానుకలు సమర్పించారు. సర్పంచులు, ఉప సర్పంచులు, నాయకులు నరసింహారెడ్డి, చంద్రునాయక్‌, రామ్మోహన్‌, శ్రీనివాస్చారి, సతీష్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement