పాల్గొన్న మహిళలు
మండలంలోని నల్లవెల్లి శివారులోగల రోడ్డుపై ఉన్న కల్వర్టు కుంగి పెద్ద గుంత పడింది. నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే ఈ దారిలో గుంత పడటంతో పెను ప్రమాదం పొంచి ఉంది. గుంత పడి నెల రోజులు గడుస్తున్నా సంబంధిత అధికారులు స్పందించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన నేపథ్యంలో పెద్ద లారీలు టన్నుల బరువుతో వెళ్లనున్నాయని, ప్రమాదం జరగకముందే మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
–ఇందల్వాయి


