రెంజల్(బోధన్): రాష్ట్రీయ స్వయంసేవక్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ శనివారం రెంజల్ మండలం కందకుర్తిలో పర్యటించనున్నారు. శ్రీ కేశవ స్ఫూర్తి మందిరాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ పర్యటన నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయి చైతన్య శుక్రవారం వేర్వేరుగా ఏర్పాట్లను పరిశీలించారు. కేంద్ర బలగాల ఆధీనంలో పర్యటన సాగుతుందని పేర్కొన్నారు. పలుశాఖల జిల్లా అధికారులతో కలిసి భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. లోటుపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రయివేటు ప్రోగ్రాం అయినా అధికారిక లాంఛనాల తో పూర్తిచేయాలని సూచించారు. బహిరంగ స భకు వచ్చే వారు వాహనాలను ఎంపిక చేసిన స్థలాల్లోనే పార్కింగ్ చేసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శుక్రవారం రాత్రి నుంచి కేంద్ర బలగాలు కందకుర్తిలోని స్ఫూర్తి మందిరం చుట్టు పక్కన ఇళ్లను స్వాధీనం చేసుకుంటారని వివరించారు. ఎలాంటి ఆటంకాలు జ రుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్థాని క అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొనేవారికి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. సభాస్థలి వద్ద అగ్నిమాపక శకటం, వైద్య బృందం అందుబాటులో ఉండాలని అన్నారు. కలెక్టర్ వెంట బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, తహసీల్దార్ శ్రావణ్‌కుమార్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్‌బాబు, ఎస్సై చంద్రమోహన్‌తోపాటు స్థానికులు ఉన్నారు.
స్ఫూర్తి మందిరాన్ని ప్రారంభించనున్న మోహన్ భగవత్
భద్రత ఏర్పాట్లను పరిశీలించిన
కలెక్టర్, సీపీ
లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు
తీసుకోవాలని అధికారులకు ఆదేశం


