● డీఎంహెచ్‌వో డాక్టర్ రాజశ్రీ
సుభాష్‌నగర్: గర్భిణులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని డీఎంహెచ్‌వో రాజశ్రీ సూచించారు. నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మాతా శిశువిభాగం, జీజీహెచ్, జిల్లా ఆస్పత్రి సంయుక్తాధ్వర్యంలో సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో రాజశ్రీ మాట్లాడుతూ గర్భిణులు 12 వారాల్లోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలని, గర్భిణి సమయంలో నాలుగుసార్లు వైద్యులతో పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ప్రసవ ప్రణాళికను ముందు చేసుకోవాలన్నారు. ప్రసవానంతరం తల్లిపాలు, టీకాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ వివరించాలని సూచించారు. ఆశా కార్యకర్తలు గృహ సందర్శనలో ప్రణాళికకు అనుగుణంగా గర్భిణులు, బాలింతలను తప్పకుండా కలిసి పోషకాహారం, వ్యాధి ని రోధక టీకాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై వివరించా లని పేర్కొన్నారు. బాన్సువాడ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు గర్భిణుల నమోదు, హైరిస్క్ జాగ్రత్తలు, తీసుకోవాల్సిన పోషకాహారం, ప్రసవ ప్రణా ళిక తదితర అంశాలపై నాటికను ప్రదర్శించారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రావు, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీని వాస్ ప్రసాద్, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జలగం తిరుపతిరావు, ఏసీపీ, వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో రాజశ్రీ


