హత్య కేసులో ఐదుగురు నిందితుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

హత్య కేసులో ఐదుగురు నిందితుల అరెస్టు

Apr 11 2026 9:22 AM | Updated on Apr 11 2026 9:22 AM

హత్య కేసులో ఐదుగురు నిందితుల అరెస్టు

మోర్తాడ్‌: మెండోరా పోలీసు స్టేషన్‌ పరిధిలో ఈనెల 6న జరిగిన హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆర్మూర్‌ రూరల్‌ సీఐ జాన్‌రెడ్డి, మెండోరా ఎస్సై సుహాసిని వెల్లడించారు. బాల్కొండలోని రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని వేముల నర్సింలు, ఉదయ్‌, కిషోర్‌, కోట అరవింద్‌, అలకుంట చందులు కర్రలతో రిషిక్‌పై దాడి చేయగా, నర్సింలు కత్తితో పొడిచాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన బాధితుడు మరుసటి రోజు చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా ఐదుగురు నిందితులను గుర్తించి వారి నుంచి కర్రలు, కత్తి, రక్తపు మరకలు ఉన్న బట్టలు, ఒక ద్విచక్ర వాహనం, మరొక కారును సీజ్‌ చేసినట్లు వారు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement