డిచ్‌పల్లి: మండల కేంద్రం శివారులోని జాతీయ రహదారి 44 పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్ వద్ద చలివేద్రం ఏర్పాటు చేయగా, శుక్రవారం బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవిలో జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులు, ప్రజల ఆరోగ్యభద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ చలివేంద్రం ప్రారంభించినట్లు తెలిపారు. 24 గంటలు (24/7) చల్లని తాగునీరు ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కమాండెంట్ తెలిపారు. అసిస్టెంట్ కమాండెంట్, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


