సుభాష్‌నగర్: నగరంలోని వెల్‌నెస్ సెంటలో వెంటనే వైద్యులను నియమించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్–రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ రామ్మోహన్‌రావు డిమాండ్‌చేశారు. ఈమేరకు శుక్రవారం రిటైర్డ్ ఉద్యోగులు, ప్రెస్‌క్లబ్ ప్రతినిదులు, ఉద్యోగులతో కలిసి జీజీహెచ్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జీజీహెచ్ ప్రతినిధులకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా రామ్మోహన్‌రావు మాట్లాడుతూ.. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, జర్నలిస్టుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెల్‌నెస్ సెంటర్‌లో వైద్యులు లేక వెలవెలపోతుందన్నారు. సమస్యను కలెక్టర్, జీజీహెచ్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికై న ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సిర్ప హన్మండ్లు, ప్రధానకార్యదర్శి ఈవీఎల్ నారాయణ, నాయకులు పురుషోత్తం, ప్రసాద్‌రావు, లావు వీరయ్య, రాధాకిషన్, మేరీ, సాంబశివరావు, బేబీ, సింధు, రామారావు, పబ్బ మురళీ, ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు సుభాష్, తదితరులు పాల్గొన్నారు.


