తెయూ(డిచ్‌పల్లి): జన్యు మార్పిడితో వైద్య, వ్యవ సాయ రంగాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని తద్వారా లాభాలు కలుగుతాయని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ రోజారాణి అన్నా రు. తెలంగాణ యూనివర్సిటీ బయోటెక్నాలజీ వి భాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండు రోజుల స దస్సు శుక్రవారం ముగిసింది. ఈసందర్భంగా రోజారాణి మాట్లాడుతూ.. క్రిస్పర్ టెక్నాలజీ వంటి ఆధునిక విధానాలు వైద్య, వ్యవసాయ రంగాలలో జన్యు పరిణామాలు, జన్యు సర్దుబాటుల వల్ల ఎన్నో లాభాలుంటాయన్నారు. ఉస్మానియా యూ నివర్సిటీ ప్రొఫెసర్ సుమలత మాట్లాడుతూ.. జ న్యు సర్దుబాటు వల్ల అస్తమా యొక్క దుష్ప్రభావా లు గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ మదుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. మానవాళి మీద సూక్ష్మజీవుల ప్రభా వం ఎంతో ఉంటుందన్నారు.ఓయూ ప్రొఫెసర్ సంధ్య అన్నమనేని మాట్లాడుతూ.. క్రిస్పర్ టెక్నాలజీ ఉపయోగించి క్యాన్సర్ తీవ్రతను తగ్గించవచ్చన్నారు. సదస్సు కన్వీనర్ ప్రసన్నశీల, ఆర్గనైజింగ్ సెక్రెటరీలు కిరణ్మయి, మహేందర్, జవేరియా తదితరులు పాల్గొన్నారు.


