షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

Apr 11 2026 9:10 AM | Updated on Apr 11 2026 9:10 AM

షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

ధర్పల్లి: మండలంలోని లక్ష్మి చెరువు తండాలో బాదావత్‌ మారోనికి చెందిన ఇల్లు శుక్రవారం షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించడంతో దగ్ధం అయ్యింది. ఇంట్లో నుంచి మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో చుట్టుపక్కల వారు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా అదుపులోకి రాలేవు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం తెలపడంతో వారు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇంట్లోని నిత్యవసర సరుకులతోపాటు ఫర్నిచర్‌ కాలిపోయాయి. సుమారు రూ.30 వేల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.

తాడ్కోల్‌లో..

బాన్సువాడ రూరల్‌: మండలంలోని తాడ్కోల్‌ గ్రామానికి చెందిన ఏశాల లలితకు చెందిన గృహంలో శుక్రవారం మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో ఇంట్లోని విలువైన సామగ్రితో పాటు విద్యార్హత సర్టిఫికెట్లు కాలిపోయాయి. స్థానికులు స్పందించి మంటలను ఆర్పివేశారు. ప్రమదంలో సుమారు 9తులాల బంగారం, 30తులాల వెండి, నగదు కాలిపోయినట్లు బాధితురాలు అధికారుల ముందు వాపోయింది. సర్పంచ్‌ అందె రమేష్‌, పంచాయతీ కార్యదర్శి ప్రశాంతి, రెవెన్యూ అధికారులు బాదితురాలిని పరామర్శించి వివరాలు అడిగి తెలుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement